By: Oneindia Telugu Video Team
Published : August 28, 2017, 03:59

గుర్మీత్‌ రామ్‌ కి మరణ శిక్ష పడాలంటూ నిరసన ?

Subscribe to Oneindia Telugu

ఉద్రిక్తకర పరిణామాలతో తల్లడిల్లుతున్న హర్యానా ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీంసింగ్‌ను లైంగికదాడి కేసుల్లో దోషిగా ప్రకటించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. అతనికి ఎంత శిక్ష విధించేదీ ఈరోజు ప్రకటించనున్నది. మధ్యాహ్నాం 2.30గంటలకు తీర్పు వస్తుందని భావిస్తున్నారు. ఆ వెంటనే హింస మొదలై కొన్ని రోజుల వరకు కొనసాగవచ్చని నేర పరిశోధన విభాగం (సీఐడీ) హెచ్చరించింది. సోమవారం శిక్షను ఖరారు చేయనున్న నేపథ్యంలో మళ్లీ హింసాకాండ చెలరేగవచ్చని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని రాష్ట్ర సీఐడీ విభాగం ఐజీ నివేదిక ఇచ్చారు. మరికొద్దిరోజులు అల్లర్లు కొనసాగవచ్చని హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రామ్ నివాస్ తెలిపారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా