By: Oneindia Telugu Video Team
Published : January 11, 2018, 06:00

రాహుల్ ద్రవిడ్ @45 : జన్మదిన శుభాకాంక్షలు

Subscribe to Oneindia Telugu

భారత్‌ క్రికెట్‌కు వన్నె తెచ్చిన దిగ్గజాల్లో రాహుల్‌ ద్రావిడ్‌ది ప్రత్యేక స్థానం. ద్రావిడ్‌గా కంటే మిస్టర్‌వాల్‌గా, మిస్టర్‌ డిపెండబుల్‌గానే ఆయనను ఎక్కువగా పిలుచుకుంటారు. ఈరోజు ఆయన జన్మదినం. ఈ నేపథ్యంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
పలువురు క్రికెటర్లు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీం ఇండియా అండర్‌ 19 టీమ్‌ కోచ్‌ గా ఉన్న రాహుల్‌ ఐసీసీ వరల్డ్‌ కప్‌ కోసం న్యూజిలాండ్‌లో ఉన్నారు. వార్మప్‌ మ్యాచ్‌లో సౌత్‌ ఆఫ్రికా టీంపై 189పరుగుల తేడాతో ఇండియా అండర్‌ 19టీం విజయం సాధించింది. కొత్త ఏడాదిలో ద్రావిడ్‌కు ఇది తొలి విజయం. 1973 జనవరి 11 న మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో జన్మించిన రాహుల్ ద్రవిడ్ 1996 నుంచి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈరోజు జన్మదినం తో రాహుల్‌ ద్రావిడ్‌ 45 వ పడిలోకి అడుగు పెట్టారు. గ్రేట్ వాల్ గా పేరు పొందిన రాహుల్‌ ద్రావిడ్‌ టెస్ట్ క్రికెట్ లో తనదైన ముద్ర వేసాడు. టెస్ట్ క్రికెట్ అంటే రాహుల్ ద్రావిడ్‌ అన్నంతగా మారిపోయింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చే ప్రపంచంలోని 10 అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపును పొందాడు . అంతేకాకుండా టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ సగటులో భారతీయులలో అతనిదే అగ్రస్థానం. అంతేకాకుండా కెరీర్ లో 10 వేల పరుగులను వన్డేలలో, టెస్టులో పూర్తి చేసిన ప్రపంచ మూడవ ఆటగాడు. ఇప్పటికి ఆ ఘనతను సాధించినది సచిన్ టెండుల్కర్ మరియు బ్రియాన్ లారా మాత్రమే.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా