By: Oneindia Telugu Video Team
Published : July 26, 2017, 12:03

పాండ్యా కల నెరవేరబోతుంది ... ఫుల్ కుష్

Subscribe to Oneindia Telugu

టెస్టు క్రికెట్ ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. ఓ క్రికెటర్ అస‌లుసిస‌లు స‌త్తా తెలిసేది కూడా టెస్టు క్రికెట్‌లోనే. వన్డేలు, టీ20ల్లో రికార్డులు సృష్టించినా, బద్దలు కొట్టినప్పటికీ... టెస్టు క్రికెట్‌లో జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు సిద్ధమవుతున్నాడు. మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే శ్రీలంకకు చేరుకుంది.శ్రీలంక పర్యటనకు ఎంపికైన జట్టులో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా ఉన్నాడు. జులై 26 (బుధవారం) నుంచి గాలే వేదికగా ఆతిథ్య శ్రీలంకతో కోహ్లీసేన తొలి టెస్టు ఆడనుంది. దీంతో లంకతో తొలి టెస్టు మ్యాచ్ మొద‌ల‌వ‌డానికి ఒక‌రోజు ముందే టెస్టు డ్రెస్ వేసుకొని పాండ్యా మురిసిపోయాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా