By: Oneindia Telugu Video Team
Published : January 25, 2018, 04:28

మంచి చెయ్యొద్దు.. మాట్లాడొద్దు.. వినొద్దు అనేదే కాంగ్రెస్ ఎజెండా !

Subscribe to Oneindia Telugu

కాళేశ్వరం పనుల పురోగతిపై మంత్రి హరీష్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ ధోరణి ని దుయ్యబట్టారు. మంచి చెయ్యొద్దు.. మంచి మాట్లాడొద్దు.. మంచి వినొద్దు.. అన్న రీతిలో ఉంది కాంగ్రెస్ పార్టీ ధోరణి అని మండిపడ్డారు. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు అని గవర్నర్ నరసింహన్ గారు చెప్పడాన్ని జీర్ణించుకోలేక ఆయన పై విమర్శలు చేయడం మీ నీచ రాజకీయాలకు అద్దం పడుతున్నాయి అని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మండిపడ్డారు . రాజ్యాంగం పట్ల, వ్యవస్థ పట్ల గౌరవం ఉంటే కెసిఆర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసారు. కాగా రెండు రోజుల పాటు జరిపిన కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన లో రాష్ట్ర గవర్నర్ వెంట పర్యటించారు హరీష్ రావు . శనివారం సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా క్షేత్ర స్థాయి పర్యటనలు, సమీక్ష సమావేశాలు జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నామని చెప్పారు. రోజుకు రెండున్నర లక్షల సిమెంటు బస్తాలు వాడుతున్నట్టు మంత్రి చెప్పారు.భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా పంట పొలాలకు నీరిచ్చేలా చిన్నపాటి ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు హరీశ్ రావు పేర్కొన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా