By : Oneindia Telugu Video Team
Published : December 27, 2017, 10:36

హరీష్ రావు తెల్లవారు జామున 3 గంటల దాకా...

తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పట్టుబడితే వదలరనే విషయం అందరికీ తెలిసిందే. రాత్రిపూట ఆయన అలుపెరుగని యాత్ర సాగించారు. సుందిళ్ల బ్యారేజీలో తెల్లవార జాము 3 గంటల వరకు పర్యటించారు. కాళేశ్వరం పనులను తనిఖీ చేశారు నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజుల పాటు కాళేశ్వరంలోనే మకాం వేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను మరింత వేగంగా పూర్తి చేయాలనే పట్టుదలతో అధికార యంత్రాంగం, ఏజెన్సీలను సన్నద్ధం చేయడానికి మూడు, నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోనే మకాం వేయాలని నిర్ణయించుకున్నారు.

తెలంగాణ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలకు పేరుపొందిన హరీశ్ రావు మరో సంచలనాన్ని నమోదు చేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు ఆయన నిరవధిక యాత్ర సాగింది. సోమవారం సాయంత్రం వరకు సిద్ధిపేటలో పలు కార్యక్రమాలలో బిజీ బిజీగా గడిపిన మంత్రి రాత్రికి కాళేశ్వరం ప్యాకేజి 6,7 లను సందర్శించారు. అనంతరం అటవీ ప్రాంతంలోని సుందిళ్ళ బ్యారేజీ పనులను తనిఖీ చేశారు.నిర్ణీత కాల వ్యవధిలో పనులన్నీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను హరీశ్ రావు కోరారు. ఇరిగేషన్ అధికారులు,ప్రజాప్రతినిధులు, మీడియాకు తెలియకుండా, మంది మార్బలం లేకుండా హుటాహుటిన ఈ ప్యాకేజి లలోని సొరంగాల నిర్మాణ పనుల పురోగతి, పంపు హౌస్ పనులను పరిశీలించారు. మంత్రి హరీష్‌పై తెలంగాణ ప్రజలుకోటి ఆశలు పెట్టుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించిన కొద్ది రోజులకే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయడానికి హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారు.సుందిళ్ళ బ్యారేజీ పనులలో రోజుకు 5 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని జరుగుతున్నట్టు మంత్రి తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా