By: Oneindia Telugu Video Team
Published : July 21, 2017, 05:44

సచిన్,ధోని, కోహ్లీ లను తలపించింది ...అసలు ఎవరు ఈ హార్మన్ ప్రీత్ కౌర్

Subscribe to Oneindia Telugu

1983 వరల్డ్ కప్... సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ అది. 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఇక భారత్ ఇంటికే అనుకున్న సమయంలో కెప్టెన్ కపిల్ దేవ్ 138 బంతుల్లో 175 పరుగులతో నాటౌట్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.కట్ చేస్తే జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం సాధించడంతో పాటు వరల్డ్ విజేతగా కూడా నిలిచిన సంగతి తెలిసిందే. సరిగ్గా 34 ఏళ్ళ తర్వాత వరల్డ్ కప్ సెమీస్ జరిగింది. కాకాపోతే ఇది మహిళల సెమీస్ పైనల్. వేదిక కూడా ఇంగ్లాండే. ప్రత్యర్ధి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా. పది సార్లు టోర్నీ జరిగితే ఆరుసార్లు ఆసీస్ వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచింది.ఇంకేముంది అందరూ ఆస్ట్రేలియానే ఫేవరేట్ అనుకున్నారు. కానీ ఒకే ఒక్క అమ్మాయి... ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మాచ్ స్వరూపాన్నే మార్చడమే కాదు కంగారులకు దిమ్మతిరిగేలా తన బ్యాట్‌తో సమాధానం చెప్పింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా