By: Oneindia Telugu Video Team
Published : July 24, 2017, 11:32

హర్మన్‌కు డీఎస్పీ ఉద్యోగంతో పాటు రూ. 5 లక్షల నజరానా

Subscribe to Oneindia Telugu

మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టును ఫైనల్ చేర్చడంలో కీలకపాత్ర పోషించిన హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఆదివారం పంజాబ్‌ ప్రభుత్వం రూ.5 లక్షల నజరానా ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌‌లో కౌర్‌ 20 ఫోర్లు 7 సిక్సుల సాయంతో 171 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.హర్మన్ ప్రీత్ కౌర్ సొంత రాష్ట్రం పంజాబ్‌ కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ ఆమెకు రూ. 5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కౌర్‌ పంజాబీ బిడ్డ అయినందుకు గర్విస్తున్నాని, కౌర్‌ ప్రదర్శన పంజాబీలంతా గర్వించేలా చేసిందని సీఎం ఆమెకు అభినందనలు తెలిపారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా