By: Oneindia Telugu Video Team
Published : July 26, 2017, 02:32

'మ్యాచ్‌ తర్వాత ఏడ్చేశాం'

Subscribe to Oneindia Telugu

వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి అనంతరం జట్టు సభ్యులందరం ఏడ్చేశామని భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పేర్కొంది. టోర్నీ ఆద్యంతం భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. చివరి వరకూ అద్భుత ప్రదర్శన చేసిన మిథాలీ సేన చివర్లో ఒత్తిడికి లోనై గెలుపు ముంగిట బోల్తా పడింది.
లార్డ్స్ వేదికగా ఆదివారం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. విజయానికి దగ్గరగా వచ్చి చివర్లో ఓటమి పాలవడంతో సగటు భారత క్రికెట్ అభిమానితో పాటు మ్యాచ్ ఆడి ఓడిన మహిళా క్రికెటర్లను సైతం తీవ్రంగా కలచివేసింది.మ్యాచ్ ముగిసిన తర్వాత తమ జట్టు సభ్యులందరం ఏడ్చేశామని ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్మన్ ప్రీత్ చెప్పింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా