• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 04, 2018, 11:46
    Duration : 03:20

    మిరియాల తో అద్బుత ఆరోగ్య ప్రయోజనాలు !

    మసాలా వంటకాలలో చిటికెడు మిరియాల పొడి వేస్తే రుచి మరింత పెరుగుతుంది, కాదంటారా? లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలకు పేరుగాంచిన ఈ మిరియాలు సుగంధ ద్రవ్యాలలో రాజు లాంటిది. మిరియాలలో మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి మినరల్స్ అధికంగా ఉన్నాయి. మిరియాలలో పీచు పదార్ధం, తక్కువ మోతాదు ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు కూడా ఉన్నాయి. మిరియాలు అతిసారం, మలబద్ధకాన్ని నిరోధించి, జీర్ణక్రియకు దోహాద పడుతుంది. మిరియాలు ప్రేగుల్లో వాయువు ఏర్పడకుండా నిరోధించి, చెమటను పెంపొందించి, మూత్రవిసర్జనను ప్రోత్సహిస్తుంది.

    మిరియాలలో యాంటీ-బాక్టీరియా, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉండడం వల్ల ఇవి అంటువ్యాధులు రాకుండా ఉండడానికి సహాయపడి, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని సరిచేస్తుంది.ఆయుర్వేదం ప్రకారం, మిరియాలు చెవి నొప్పి, పుళ్ళను కూడా నివారించడానికి సహాయపడుతుంది. ఈ ప్రయోజనాలను అందించడమే కాకుండా, మిరియాలు స్దూలకయంపై పోరాడడానికి ఉపయోగపడుతుంది, బరువు తగ్గించే ఆహార పదార్ధాలలో సువాసన ఏజెంట్ గా ఉపయోగించుకోవచ్చు. బరువు తగ్గడానికి మిరియాలలో ఉన్న 10 ఆహార ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

    మిరియాలు పైపెరిన్ అనే శక్తివంతమైన మిశ్రమం ఉంది, ఇది మిరియాలకు మంచి రుచిని ఇస్తుంది. ఈ మిశ్రమం నూతన కొవ్వు కణాలు ఏర్పడడంలో కలుగచేసుకుని, అడిపోజేనేసిస్ అనే ప్రతిచర్య మీ నడుముని తగ్గించి, కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.ఆహార సరైన సమీకరణలో మిరియాలు చికిత్సగా పనిచేస్తాయి. అంతేకాకుండా, మిరియాల బయటి పొర కొవ్వు కణాల విచ్చిన్నతను ప్రేరేపించే శక్తివంతమైన ఫైటో న్యూట్రిఎంట్లను కలిగి ఉంటుంది.

    బరువు తగ్గడానికి, కొన్ని మిరియపు గింజలకు రెండు తమలపాకులను జోడించి రోజుకు ఒకసారి నమలండి. మిరియాలు, తమలపాకులు రెండూ మీ శరీరం నుండి కొవ్వును తగ్గించి, బరువును తగ్గించడానికి సహాయపడతాయి కాబట్టి ఈ పద్ధతి బరువు తగ్గే విషయంలో శక్తివంతంగా పనిచేస్తుంది.

    మీరు క్యాలరీలను నియంత్రించే కొవ్వు తగ్గే ఆహరం తీసుకుంటుంటే, మీ ఆహారంలో మిరియాలను జతచేయండి. ఒక టీస్పూన్ మిరియాలలో కేవలం 8 క్యాలరీలు మాత్రమే ఉంటాయి, ఇది సాస్, మరినేడ్స్ కోసం తక్కువ క్యాలరీలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.ప్లాస్మా, లిపిడ్ ప్రోఫైల్స్ లో కొవ్వు ఆమ్లాలు, ట్రై గ్లిజరైడ్స్, ఫాస్ఫోలిపిడ్స్, కొవ్వు స్థాయిలను తగ్గించడానికి మిరియాలు పేరుగాంచాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ గాఢతను పెంచుతుంది, శరీరంలో కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా ఆపుతుంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా