ఈ మూడింటినీ రోజూ ఆహారంలో భాగం చేసుకోండి, అనారోగ్యాలకు చెక్ పెట్టండి
Published : November 08, 2022, 01:30
మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి అనే విషయం చాలామందికి తెలియదు. ఇక వీటిని ఆహారంలో వస్తే తీసి పక్కన పెట్టే వారు చాలామంది ఉంటారు. కానీ మన నిజ జీవితంలో మనం ఇంట్లో నిత్యం ఉపయోగించే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు లలో మన ఆరోగ్యానికి కావల్సిన గొప్ప ఔషధ గుణాలు దాగి ఉన్నాయని, అవి మన అనారోగ్య సమస్యలను ఇట్టే దూరం చేస్తాయన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది.