By: Oneindia Telugu Video Team
Published : September 01, 2017, 12:44

జగన్ పాదయాత్రపై హైకోర్టు షాక్ జగన్ ఈ కారణం కనుగొన్నారు

Subscribe to Oneindia Telugu


అక్టోబర్ నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న వైసిపి అధినేత వైయస్ జగన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై ఉన్న కేసుల విచారణకు వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రతి శుక్రవారం హైదరాబాదులోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను గురువారం కొట్టివేసింది.తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పిటిషనర్‌ జగన్‌పై తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఒకవేళ ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపునిస్తే పాదయాత్ర వంటి రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ దుర్వినియోగం చేసే అవకాశాన్ని కొట్టివేయలేం. కోర్టులో హాజరు మినహాయింపు కోరడానికి నాలుగేళ్ల తరువాత ఆకస్మికంగా వైసిపి పార్టీ అధ్యక్షుడిగా పాదయాత్ర అనే కారణాన్ని కనుగొన్నారు.' అని హైకోర్టు పేర్కొంది. ప్రజాప్రతినిధిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా తాను జనంలోకి వెళ్లవలసి ఉందని, పాదయాత్ర కూడా చేయాల్సి ఉందని, అందువల్ల అన్ని ఛార్జీషీట్లలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని జగన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ సత్యనారాయణ మూర్తి విచారణ జరిపారు. అభ్యర్థనను తిరస్కరించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా