By : Oneindia Telugu Video Team
Published : December 16, 2017, 06:23

పెళ్లికి జాతకం చూడకపోతే ఏమవుతుంది ?


వివాహ నిశ్చయానికి ముందు పిల్ల, పిల్లవాడి జాతకాలు చూడటం మన సంప్రదాయం. జ్యోతిషంపై ఉన్న నమ్మకం వల్లనే వాటిని చూపించుకోవడం జరుగుతుంది.. వధూ వరుల జాతకంలో సప్తమ, అష్టమ స్థానాలను చూస్తారు. సప్తమ, అష్టమ స్థానములు మిత్ర రాశులు, మిత్ర గ్రహాలు అయితేనే వివాహాన్ని నిర్ణయించుకుంటారు. వివాహానికి వధూవరుల జాతకాలు కలవాలని, పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలని అనుకుంటారు. జాతకాలు కలిస్తే వధూవరులు జీవితంలో కూడా కలసిమెలసి ఉంటారు అంటారు.
భూమి మీద జీవిస్తున్న మనుషులపై ఖగోళంలో ఉన్న గ్రహాల ప్రభావం ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అన్ని దేశాలలోను వివాహాలు జరుగుతున్నాయి గానీ అక్కడ విడాకులు, కలహాలు, చిన్న వయస్సులో మరణాలు ఎక్కువగా గమనిస్తామని, కారణం ఈ జాతక దోషాలేదేనని జ్యోతిష్కులు అంటున్నారు.వివాహానికి ముఖ్యమైన పొంతనలలో కనీసం 60 శాతం కలవాలని, జన్మించిన నక్షత్రాల ప్రభావం, రాశులు, నక్షత్రాల గణాలు, వాటి నాడులు, వాటి మైత్రి వంటి విషయాలు చూసి వివాహానికి అనుకూలమా? కాదా? అంచనా వేస్తారు.
నవగ్రహాల ప్రభావం మన జీవితంలో 12 కోణాలుగా ఉంటుందని, జన్మించిన సమయంలో ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి, మన జీవితంలో మంచిచెడులు జరుగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతుందని అంటున్నారు. కాబట్టి ఆ శాస్త్ర నియమాలను జీవితంలో ప్రధాన ఘట్టమైన వివాహానికి కూడా తప్పనిసరిగా పరిశీలించాలని అభిప్రాయపడుతున్నారు. భారత ఉపఖండంలో పుట్టి పెరిగేవారి కోసం ఇక్కడ భూమి నుంచి ఆయా గ్రహాలు ఉన్న దూరాలను, డిగ్రీలను బట్టి, ఫలితాలను నిర్ణయించే శాస్త్రం ఏర్పడిందని పండితుల అభిప్రాయం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా