By: Oneindia Telugu Video Team
Published : August 29, 2017, 04:44

వరదల్లో 13 లక్షల మంది 800 ఏళ్లకు ఒకసారి ఇలా...

Subscribe to Oneindia Telugu

హరికేన్‌ హార్వే కారణంగా అమెరికాలోని టెక్సాస్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల 13 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారు. వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. టెక్సాస్‌లో ఈ స్థాయి వరదలు ఇంతకుముందెన్నడూ లేవని జాతీయ వాతావరణ సేవలవిభాగం ప్రకటించింది. వర్షాలు ఇప్పట్లో తగ్గవని, బుధవారంనాటికి 127 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానుందని అక్కడి జాతీయ వాతావరణ సేవలవిభాగం హెచ్చరించింది. గత 72 గంటల్లో 76.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. టెక్సాస్‌లోని పాఠశాలలు, విమానాశ్రయాన్ని వారంపాటు మూసివేయనున్నారు.
800 ఏళ్లకు ఒకసారి ఈ స్థాయిలో వరదలు వస్తాయని అధికారులు చెప్పారు. వరదనీరు ఇళ్లను చుట్టుముట్టడంతో పైకప్పుపై కూర్చుని ప్రాణాలు కాపాడుకుంటున్న వెయ్యి మందికిపైగా రక్షించాలని ఫోన్లు చేస్తున్నారన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా