By: Oneindia Telugu Video Team
Published : January 02, 2017, 03:32

భార్యను దారుణంగా చంపిన భర్త

Subscribe to Oneindia Telugu

ఆ కుటుంబంలో.. అనుమానం పెనుభూత‌మైంది. క‌ట్టుకున్న వాడే కాల‌య‌ముడ‌య్యాడు.. నూరేళ్లు క‌లిసి ఉంటానన్న ఆలిని.. కాటికి చేర్చాడు… భార్య‌పై అనుమానంతో కిరాత‌కంగా హత‌మార్చాడు.. క‌న్న‌బిడ్డ‌ల ఎదుటే ఆలిని తెగ‌న‌రికాడు ఒక దుర్మార్గుడు. అనుమానంతో ప‌గ పెంచుకున్న ఒక భ‌ర్త.. కాల‌య‌ముడై భార్య‌ను క‌డతేర్చాడు.. క‌న్న‌బిడ్డ‌ల‌ను అనాధ‌ల‌ను చేశాడు. అత్యంత విషాద‌మైన ఈ ఘ‌ట‌న కోవూరు మండ‌లం లేగుంట‌పాడులో జ‌రిగింది. ప‌ల్లె తెల్లారుతుండ‌గా క‌సాయి భ‌ర్త చేసిన దారుణంతో లేగుంట‌పాడు త‌ల్ల‌డిల్లింది, ఒక‌ప్ప‌డు అక్ష‌రాస్యత‌కు, ఉద్య‌మాల‌కు కేంద్రంగా విరాజిల్లిన ఈ గ్రామంలో ఊహించని విధంగా జరిగిన ఈ దుర్ఘ‌ట‌న అందిర‌నీ క‌లిచివేసింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా