By : Oneindia Telugu Video Team
Published : November 30, 2017, 10:42

'మెట్రో' ఎక్కకుండానే స్మార్ట్ కార్డు బ్యాలెన్స్ గోవిందా?

బుధవారం నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో.. రాజధాని ప్రజలు మెట్రో ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తొలిసారిగా మెట్రోలో జర్నీ చేసి.. ఆ జ్ఞాపకాలను సెల్ఫీల రూపంలో పదిలపరుచుకుంటున్నారు. తొలిసారి మెట్రో జర్నీ వారిలో ఉత్సాహాన్ని నింపుతోంది. బుధవారం తెల్లవారుజామున 5గం. నుంచే మెట్రో స్టేషన్లకు తాకిడి మొదలైంది. స్మార్ట్ కార్డు కౌంటర్స్ కిటకిటలాడాయి. తొలిరోజు మెట్రో జర్నీ చాలామందికి కొత్త అనుభవాన్ని మిగల్చగా.. కొద్దిమందికి మాత్రం చేదు అనుభవం తప్పలేదు.
ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్‌ తొలిరోజు మెట్రో జర్నీ చేయాలన్న ఆత్రుతతో నాగోల్‌ స్టేషన్‌కు వెళ్లాడు. రూ.200 చెల్లించి స్మార్ట్‌ కార్డు తీసుకున్నాడు. ఇందులో రూ.100 మెట్రో ప్రయాణానికి వాడుకోవచ్చు. ప్లాట్ ఫామ్ పైకి వెళ్లాక అంతా కలియతిరుగుతూ దాదాపు గంట సమయం పాటు అక్కడే గడిపాడు శ్రీనివాస్
ఎక్కువసేపు ప్లాట్ ఫామ్ పై గడపడంతో శ్రీనివాస్ స్మార్ట్ కార్డులోని రూ.100 కాస్త రూ.12కి వచ్చింది. మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చేముందు కార్డులో బ్యాలెన్స్ చెక్ చేసుకోగా ఈ విషయం తెలిసింది. దీంతో శ్రీనివాస్ షాక్ తిన్నాడు. మెట్రో రైలు ఎక్కకుండానే రూ.88 ఖర్చవడం అతనిని షాక్ కు గురిచేసింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా