By: Oneindia Telugu Video Team
Published : January 24, 2018, 12:44

లేడీ ఏఎస్పీతో సీఐ బాగోతం : కొత్త మలుపులు

Subscribe to Oneindia Telugu

కట్టుకున్న భర్తను మోసం చేస్తూ ఓ సీఐతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఏసీబీ ఏఎస్పీ సునీత రెడ్డిని సస్పెండ్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు.. ఆమెపై పలు ఆంక్షలు విధించారు. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి తన భార్య సునీతతో కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ రెడ్డిని భర్త సురేందర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే.
వారిద్దరి వ్యవహారాన్ని వీడియో సాక్ష్యాలతో సహా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇద్దరు ప్రవర్తించారని భావించిన అధికారులు వారిద్దరినీ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా పేరిట జారీ అయింది.
ఈ ఉత్తర్వుల్లో సస్పెన్షన్ అమలులో ఉన్నంత కాలం ముందస్తు అనుమతి లేకుండా హైదరాబాద్ నగరాన్ని వీడవద్దని ఆమెకు ఆదేశాలు జారీ చేశారు. సీఐపై నమోదైన కేసు ఎఫ్ఐఆర్‌లో ఆమె పేరు ఉండటం, ఆమె అనైతికంగా ప్రవర్తించిందన్న ఆరోపణలకు సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా