By: Oneindia Telugu Video Team
Published : June 23, 2017, 05:49

ఇదే శిరీష అసలు కథ

Subscribe to Oneindia Telugu

త‌ప్పు చేయ‌డం సుల‌భం. కానీ చేసిన త‌ప్పును ఒప్పుకోవ‌డం చాలా క‌ష్టం. మాట తూల‌డం సుల‌భం కానీ ఆ మాట‌ను వెన‌క్కి తీసుకోవ‌డం చాలా క‌ష్టం. ఇప్పుడు బ్యుటీషియ‌న్ శిరీష కేసులో ఇదే జ‌రుగుతుంది. శిరీష చేసిన త‌ప్పును ఎత్తిచూపే వారే కానీ... అస‌లు త‌ప్పు ఎలా జ‌రిగిందో... ఎందువ‌ల్ల జ‌రిగిందో ఆలోచించేవాళ్లు క‌రువైపోయారు. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్నఅస‌భ్య ప్ర‌చార‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. వాస్త‌వానికి శిరీష చేసిన త‌ప్పు ఒక్క‌టే. క‌ట్టుకున్న భ‌ర్త‌ను, క‌న్న కూతురుని విడిచిపెట్టి రాజీవ్‌తో స‌హ‌జీవ‌నం చేస్తుండ‌టం. దీన్ని ఏ ఒక్క‌రూ స‌మ‌ర్ధించ‌రు. కానీ శిరీష ఆ ప‌ని ఎందుకు చేయాల్సి వ‌చ్చింది... నిజంగానే శిరీష బ్యాడ్ క్యారెక్ట‌ర్ అయితే రాజీవ్ ను ఎందుకు అంత‌గా ఇష్ట‌ప‌డుతుంది. ఆర్ధిక స‌మ‌స్య‌ల‌తో ఇంటి గ‌డ‌ప దాటి ఉద్యోగంలో చేరిన శిరీష‌... రాజీవ్‌తో ప‌రిచ‌యం పెంచుకుని ప్రేమ‌లోప‌డింది. ఇంతో రాజీవ్‌కు మ‌రో అమ్మాయితో సంబంధం ఉంద‌ని తెలుసుకుని... కుమిలిపోయింది. ఎలాగైనా రాజీవ్ ను ద‌క్కించుకోవాల‌ని... వాళ్లిద్ద‌రి మ‌ధ్య మ‌రో అమ్మాయి విల‌న్‌గా మార‌కూడ‌ద‌ని బావించింది. అందుకే త‌న స్నేహితులైన నందు, న‌వీన్ ల సాయం కోరింది. వారితో మాట్లాడిన మాట‌లు చూస్తే.. శిరీష్ రాజీవ్ ను ఎంత‌గా ఇష్ట‌ప‌డిందో అర్ధ‌మ‌వుతుంది. ఆ ఆడియో ఓసారి విందాం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా