By: Oneindia Telugu Video Team
Published : May 17, 2017, 04:58

టీ కప్పులో తుఫాన్‌ అసలు జరిగిన కథేంటి..?

Subscribe to Oneindia Telugu

ఒక్కసారిగా ఎందుకంత భారీ స్థాయిలో నిరసనలు గుప్పుమన్నాయి. టీ కప్పులో తుఫాన్‌ సృష్టించడంలో తెలంగాణ సర్కారు తన సత్తాను నిరూపించుకుందా..? ఇదే ధర్నా చౌక్‌ దగ్గర గతంలో తెలంగాణ ఉద్యమాలు సైతం జరిగాయి. అప్పట్లో ఇది అడ్డు రాలేదా..? మూడు నెలలుగా మూగబోయిన ధర్నాచౌక్‌ దద్దరిల్లింది. వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులతో హోరెత్తింది. పోలీసుల లాఠీచార్జితో రణరంగంగా మారింది. ధర్నాచౌక్‌ వద్దంటూ వాకర్స్‌ అసోసియేషన్, స్థానిక కాలనీ సంఘాల పేరుతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, మఫ్టీలో కొందరు పోలీసులు పోటీ ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆందోళనకారులు కుర్చీలు ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు. ఇందులో సుమారు 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా ఆందోళనకారులు వెనుకడుగు వేయకుండా ధర్నాచౌక్‌ను ఆక్రమించుకున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా