By: Oneindia Telugu Video Team
Published : July 20, 2017, 11:58

పూరీ కి చుక్కలు చూపించిన సిట్ అధికారులు... లోపలేం జరిగిందంటే..

Subscribe to Oneindia Telugu

పూరీ జగన్నాథ్.. ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది. ఏ ఇద్దరిని చూసినా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. డ్రగ్స్ కేసులో బుధవారం సిట్ ఎదుట హాజరైన ఈ టాలీవుడ్ దర్శకుడిని అధికారులు ఏకంగా 11 గంటలపాటు విచారించడం సంచలనంగా మారింది. ఉదయం 10:30 గంటలకు మొదలైన విచారణ ఏకంగా రాత్రి 9:30 వరకు కొనసాగింది. ఏకంగా 500 వరకు ప్రశ్నలు సంధించిన అధికారులు పూరీని ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలిసింది. అయితే మూసిన తలుపులు వెనక ఏం జరిగిందన్న ఉత్కంఠ ఇప్పుడు చిత్రసీమను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. బుధవారం ఉదయం విచారణ కోసం పూరీ జగన్నాథ్ హైదరాబాద్‌లోని ఆబ్కారీ భవన్‌కు చేరుకున్నారు. సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? ఎలా సమాధానాలు చెప్పాలి? అనే విషయంలో ముందుగానే న్యాయనిపుణులతో చర్చించి పూర్తిగా సన్నద్ధమై వచ్చారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా