By: Oneindia Telugu Video Team
Published : September 23, 2017, 06:15

హైదరాబాద్ మెట్రో రైలు : సింగపూర్‌ లాగానే !

Subscribe to Oneindia Telugu

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మెట్రోరైల్‌ స్టేషన్లు సరికొత్త అందాలు తీసుకురానున్నాయి. సింగపూర్‌ వంటి దేశాల్లో మాదిరిగా ప్రయాణికులకు అత్యాధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. నవంబర్ 28వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా మెట్రో రైలును ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. అప్పటికల్లా ఈ కారిడార్‌లోని 24 స్టేషన్ల వద్ద 600 మీటర్ల మేర పూర్తిస్థాయిలో అత్యాధునిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. మియాపూర్‌ వంటి పెద్దస్టేషన్ల వద్ద అభిరుచి ఉన్నవారు చిత్రకళలో నైపుణ్యం పొందేందుకు కొంతభాగం కేటాయిస్తారు. కొన్ని స్టేషన్ల నుంచి ఆకాశమార్గంలోనే బస్టాపులకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతోపాటు రైల్వే స్టేషన్లకు కొత్త సొగసులు కల్పిస్తున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా