By : Oneindia Telugu Video Team
Published : November 06, 2017, 04:36

HYD మెట్రో రైలు: సీటు దొరికితే అదృష్టమే!

భాగ్యనగర వాసులను ఎన్నాళ్ల నుంచో ఊరిస్తోన్న మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడింది. నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మియాపూర్ లో మెట్రో రైలును ప్రారంభించనున్నారు. మెట్రో కారిడార్ కు మియాపూర్ కేంద్రంగా మారనుంది. సర్వహంగులు దిద్దుకుంటున్న మెట్రో కారిడార్ తో మియాపూర్ రూపురేఖలు మారనున్నాయి. ప్రారంభం దగ్గర పడడంతో మెట్రో పనులు శరవేగంగా సాగుతున్నాయి. మెట్రో కారిడార్ అంతటా గ్రీనరీ, పార్కింగ్, సైకిల్ రైడింగ్, ఫుట్ పాత్ లు, చిన్నారుల కోసం ఆటస్థలాలు, రోడ్డు దాటేందుకు అవసరమైన మార్గాలు.. ఇలాంటి పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మెట్రో రైలు భద్రతకు సంబంధించి ఆయా శాఖల అధికారులు పలుమార్లు సమావేశమయ్యారు.
ఎయిర్ పోర్టుకు వెళ్లాలంటే కష్టం కానీ మెట్రో రైలు స్టేషన్లకు వెళ్లడం మాత్రం ఎంతో సులభం. ఇందుకు తగ్గట్లుగా అవసరమైన బస్సు సౌకర్యం కల్పించనున్నారు మెట్రో అధికారులు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా