By: Oneindia Telugu Video Team
Published : September 26, 2017, 05:55

మైదానంలో చెడుగా ప్రవర్తిస్తే బయటికే

Subscribe to Oneindia Telugu

క్రికెట్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పలు నిబంధనల్లో మార్పులు చేయడంతో పాటు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 28 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు టెస్టులు, వన్డేల్లో మాత్రమే ఉన్న అంపైర్ నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ను టీ20ల్లో కూడా ప్రవేశపెడుతూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో 80 ఓవర్ల తర్వాత అదనపు రివ్యూలు అమలు చేసే విధానానికి ఐసీసీ స్వస్తి పలికింది. కొత్త నిబంధనల ప్రకారం ఒక ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లు ముగిసిన పక్షంలో అదనపు రివ్య్యూలు కోరే అవకాశం ఉండదు. అంతేకాదు ప్రతి ఇన్నింగ్స్‌లో రెండు విజయవంతం కాని రివ్యూలను ఉపయోగించుకునే వీలు కల్పించింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా