By : Oneindia Telugu Video Team
Published : November 04, 2019, 06:30
Duration : 01:37
01:37
T20 వరల్డ్‌కప్ పూర్తి షెడ్యూల్ ఇదే..!!
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. క్వాలిఫయిర్ టోర్నీకి సంబంధించిన అన్ని మ్యాచ్‌లు ఇటీవలే ముగియడంతో టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌పై స్పష్టత వచ్చింది. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 దేశాలు పాల్గొంటున్నాయి.క్వాలిఫయిర్ టోర్నీలో పపువా న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ వంటి చిన్న జట్లు అర్హత సాధించడంతో ఐసీసీ వినూత్నంగా షెడ్యూల్‌ను రూపొందించింది. చిన్న జట్లను ఏ, బీ అనే రెండు గ్రూపులుగా విభజించింది. టాప్-10 పది జట్లలో ఉన్న రెండు పెద్ద జట్లను ఈ రెండు గ్రూపుల్లో చేర్చింది.