By : Oneindia Telugu Video Team
Published : July 24, 2017, 11:30

ప్చ్ ...పోరాడి ఓడిన ఇండియా మ్యాచ్ హైలైట్స్

ఎంతో ఊరించిన టైటిల్ వేటలో భారత మహిళా క్రికెట్ జట్టు చివరిమెట్టుపై చతికిలపడింది. కేవలం 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత్ లో మహిళా క్రికెట్ పై ఉన్న అపోహలను తొలగించేందుకు వరల్డ్ కప్ విజయం ఎంతో దోహదపడుతుందని, తమ ఆటతీరు, ప్రతిభపై ఉన్న అనుమానాలన్నిటినీ పటాపంచలు చేయడానికి వరల్డ్ కప్ ను తీసుకురావడమే మార్గమని భావించిన మహిళా క్రికెట్ జట్టు ప్రయత్నాలను ఇంగ్లండ్ మహిళా జట్టు బౌలర్ ష్రబ్ సోల్ అద్భుత స్పెల్ నీరుగార్చింది.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టును భారత బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ప్రధానంగా టాప్ పేసర్ జులన్ గోస్వామి అద్భుతమైన బంతులతో ఇంగ్లండ్ బ్యాట్స్ వుమన్ ను స్వేచ్ఛగా ఆడనివ్వలేదు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా