By: Oneindia Telugu Video Team
Published : July 22, 2017, 05:27

ఈ ఆరుగురు రాణిస్తే కప్ మనదే

Subscribe to Oneindia Telugu

భారత మహిళా క్రికెట్ జట్టు ముందు అద్భుతమైన అవకాశం నిల్చుంది. భారత్ లో క్రికెట్ కు ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. అదే సమయంలో టీమిండియాకు ఉన్న ఆదరణ మహిళా క్రికెట్ జట్టుకు లేదు. కేవలం ఆదరణ మాత్రమే కాదు, రెమ్యూనరేషన్, కాంట్రాక్ట్, ఇతర సౌకర్యాల కల్పన వంటి అన్ని విషయాల్లో మహిళా క్రికెట్ జట్టు వివక్ష ఎదుర్కొంటోంది. దీనిపై బీసీసీఐని ప్రశ్నించలేని పరిస్థితి మహిళా క్రికెట్ జట్టుది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ లో బలమైన ఆస్ట్రేలియా జట్టును మహిళా క్రికెట్ జట్టు మట్టి కరిపించింది. హర్మన్ ప్రీత్ కౌర్ వీరోచిత ఇన్నింగ్స్ తో ఫైనల్ లో కాలు పెట్టింది.ఫైనల్ లో రేపు ఇంగ్లండ్ జట్టును ఢీ కొట్టనుంది. ఈ నేపథ్యంలో బలమైన ఇంగ్లండ్ పై విజయం సాధించాలంటే టీమిండియాలోని ఆరుగురు ఆటగత్తెలు అద్భుతంగా రాణించాల్సిన అవసరం ఉంది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా