దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search
By : Oneindia Telugu Video Team
Published : April 26, 2018, 09:48
Duration : 02:07

వరల్డ్‌కప్ 2019 షెడ్యూల్‌లో మార్పు

వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వరల్డ్‌కప్‌కు సంబంధించి షెడ్యూల్‌లో చిన్న మార్పు జరిగింది. టోర్నీలో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ జూన్ 2 జరగాల్సి ఉంటే, దానిని జూన్ 4వ తేదీకి మర్చారు.
ఈ మార్పునకు కారణం జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల మేరకు ఐపీఎల్ ఫైనల్‌కు, అంతర్జాతీయ మ్యాచ్‌కు మధ్య కనీసం 15 రోజుల సమయం కచ్చితంగా ఉండాలి. కోల్‌కతాలో మంగళవారం జరిగిన ఐసీసీ సీఈఓల మీటింగ్‌లో దీనిపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
2019 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ మార్చి 29 నుంచిమే 19 వరకు జరగనుంది. దీంతో 15 రోజుల నిబంధన మేరకు జూన్ 4నే తొలి మ్యాచ్ ఆడే వీలుంటుందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.
టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ షెడ్యూల్‌లో మార్పుకు ఐసీసీ సీఈసీ కూడా అంగీకరించింది. దీనిని ఐసీసీ బోర్డుకు సిఫారసు చేశామని ఆ అధికారి వెల్లడించారు. గతంలో వరల్డ్ కప్ లాంటి పెద్ద ఈవెంట్‌లను భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌తో ఐసీసీ ప్రారంభించేది.
2015 వరల్డ్‌కప్(అడిలైడ్), 2017 చాంపియన్స్ ట్రోఫీ(బర్మింగ్ హామ్) ఇలాగే ప్రారంభమైంది. అయితే ఈసారి టోర్నీ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనుందని ఆ అధికారి చెప్పారు. రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్‌కప్‌లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్‌తో ఆడాల్సి ఉంటుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి