By : Oneindia Telugu Video Team
Published : April 11, 2018, 02:39

పీఎంకే నిరసనలో అపశృతి: రైలుపైకెక్కిన యువకుడు మృతి

కావేరీ వాటర్ బోర్డు కోసం తమిళనాడులో పీఎంకే బుధవారం తలపెట్టిన రైల్ రోకోలో అపశ్రుతి చోటు చేసుకుంది. తిండివనంలో రైల్ రోకో చేస్తూ ఇద్దరు వ్యక్తులు రైల్ పైకి ఎక్కారు. రైలుపైకి ఎక్కినినాదాలు చేస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో ఓ యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతి చెందిన యువకుడిని పీఎంకే కార్యకర్త రంజిత్‌గా గుర్తించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా