By : Oneindia Telugu Video Team
Published : January 19, 2021, 01:20
Duration : 01:33
01:33
శెభాష్ సిరాజ్.. నిన్ను చూసి మీ తండ్రి గర్వపడతాడు!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసించాడు.nరెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. తద్వారా అరుదైన ఘనతలను అందుకున్నాడు. అరంగేట్ర సిరీస్‌లోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా గబ్బా వేదికగా ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. ఈ నేపథ్యంలో సిరాజ్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.