By : Oneindia Telugu Video Team
Published : January 21, 2021, 09:00
Duration : 01:56
01:56
'స్పైడర్' పంత్ ఏదైనా చేయగలడు....పాట పాడిన ఐసీసీ!
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రశంసలతో ముంచెత్తింది. రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్ అని పేర్కొంటూ ఓ ట్వీట్ చేసింది. అంతేకాదు అతనిపై ఓ పాట కూడా రూపొందించింది. మంగళవారం ఆస్ట్రేలియాతో ముగిసిన గబ్బా టెస్టులో పంత్ (89; 138 బంతుల్లో 9x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. దీంతో భారత్ వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పంత్‌పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.