By : Oneindia Telugu Video Team
Published : December 04, 2020, 09:50
Duration : 02:39
02:39
ఆస్ట్రేలియా కోచ్ సీరియస్!!
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టీ20 మ్యాచులో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను 150 పరుగులకే పరిమితమైంది. ఈ టీ20 మ్యాచ్‌లో ఓ వివాదం తలెత్తింది. రవీంద్ర జడేజా స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా యజువేంద్ర చహల్‌ను టీమిండియా తీసుకోవడం వివాదానికి కారణమైంది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్.. ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే ముందు తమ దేశానికే చెందిన రిఫరీ డేవిడ్ బూన్‌తో గొడవకు దిగాడు.