By : Oneindia Telugu Video Team
Published : December 05, 2020, 01:10
Duration : 01:50
01:50
చాహల్ ను తీసుకోవాలనే ఆలోచనే లేదు.. కానీ అదే కలిసొచ్చింది!
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు జరిగిన తొలి టీ20 మ్యాచులో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఈ మ్యాచులో చహల్‌ను తీసుకోవాలనే ఆలోచనలే లేవు. కంకషన్ సబ్‌స్టిట్యూట్ అనేది విచిత్రమైన పరిస్థితి. అయితే ఈరోజు అది మాకు కలిసివచ్చింది. ఆసీస్‌ను చిత్తు చేయడంలో చహల్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ప్రత్యర్థి జట్టుకు చహల్ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు' అని కోహ్లీ పేర్కొన్నాడు.