By : Oneindia Telugu Video Team
Published : November 30, 2020, 03:40
Duration : 01:49
01:49
ఆసీస్ అమ్మాయికి ఇండియన్ ఫ్యాన్ ప్రపోజ్.. వీడియో వైరల్..
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకోంది. ఆసీస్ ఇన్నింగ్స్ సందర్భంగా గ్యాలరీలో ఓ ఇండియన్ ఫ్యాన్ చేసిన సందడి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆసీస్‌కు చెందిన తన గర్ల్‌ఫ్రెండ్‌కు సదరు భారత అభిమాని ప్రపోజ్ చేశాడు. ఆమెపై తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డేను వేదికగా ఎంచుకున్నాడు. మోకాళ్లపై కూర్చొని తనవెంట తీసుకొచ్చిన రింగ్‌ను తన ప్రేయసి వేలికి తొడిగాడు. ఈ ఊహించని ఘటనతో ఒకింత ఆశ్చర్యానికి గురైన సదరు యువతి.. సంతోషం వ్యక్తం చేస్తూ భారత అభిమాని ప్రేమను అంగీకరించింది.