By : Oneindia Telugu Video Team
Published : January 15, 2021, 07:20
Duration : 01:42
01:42
నోటికి పని చెప్పిన పంత్.. లైవ్ లో ఫైర్ అయిన కామెంటేటర్లు!!
టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి రోజులో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి కామెరాన్ గ్రీన్, టిమ్ పైన్ క్రీజులో ఉన్నారు. మార్నస్ లబుషేన్ సెంచరీ చేయగా.. మాథ్యూ వేడ్ ఫర్వాలేదనిపించాడు. ఇద్దరూ నాలుగో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. తొలి రోజు ఆటలో ఆసీస్‌దే పైచేయిగా నిలిచింది. భారత బౌలర్లలో టీ నటరాజన్ 2 వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకుర్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.