By : Oneindia Telugu Video Team
Published : January 14, 2021, 11:20
Duration : 01:36
01:36
బ్రిస్బేన్ టెస్టుకు అశ్విన్ దూరం!! కుల్దీప్ ఆడుతాడా?
మూడో టెస్టును డ్రాగా ముగించడంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం తీవ్ర వెన్నునొప్పితో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్న అశ్విన్.. నిర్ణయాత్మక బ్రిస్బేన్ టెస్టులో బరిలోకి దిగడం అనుమానంగా కనిపిస్తోంది. గాయంతో బాధపడుతున్న అశ్విన్ పూర్తి ఫిట్‌గా లేడని తెలుస్తోంది. చివరి టెస్టుకు మరొక్కరోజే సమయం ఉండడంతో రహానే సేనలో ఆందోళన మొదలైంది. ఒకవేళ యాష్ ఫిట్‌గా లేకుంటే.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.