By : Oneindia Telugu Video Team
Published : January 19, 2021, 01:40
Duration : 02:08
02:08
రిషబ్ పంత్ అరుదైన రికార్డు.. ధోనీ కన్నా వేగంగా!!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు అందుకున్నాడు. భారత్ తరఫున పంత్ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. అంతేకాదు టీమిండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లో (27) వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. మాజీ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ కన్నా పంత్ వేగంగా 1000 రన్స్ చేశాడు. పంత్ 27 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు చేయగా.. మహీ 32 ఇన్నింగ్స్‌లలో 1000 రన్స్ చేసి రెండో స్థానంలో నిలిచాడు.