By : Oneindia Telugu Video Team
Published : January 19, 2021, 11:20
Duration : 01:40
01:40
నటరాజన్‌పై షేన్ వార్న్ ఫిక్సింగ్ ఆరోపణలు..
టీమిండియా సెన్సేషన్ టీ నటరాజన్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ సందేహం వ్యక్తం చేశాడు. ఈ పర్యటనలో అద్వితీయ ఆటతో ఆకట్టుకున్న అతను నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఏడు నో బాల్స్ వేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, అతని తీరు సందేహాస్పదకంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిక్సింగ్ పాల్పడ్డాడేమో అనే అనుమానం వచ్చేలా వ్యాఖ్యానించాడు. ఇక బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టిన నటరాజన్.. మూడు వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఏడు నోబాల్స్ వేసాడు. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావించిన షేన్ వార్న్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.