By : Oneindia Telugu Video Team
Published : January 20, 2021, 06:20
Duration : 02:27
02:27
భారత క్రికెట్ చరిత్రలో మధుర ఘట్టం ఇది.. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే..!
భారత్ ఆస్ట్రేలియా జట్లమధ్య జరిగిన టెస్టు సిరీస్ లో 3 వికెట్ల తేడాతో చివరి టెస్ట్‌లో గెలిచి 2-1తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భరత్ సొంతం చేసుకుంది. 32 ఏళ్లుగా ఓటమెరుగని బ్రిస్బేన్‌లో కంగారూల పని పట్టి గబ్బా కోటను బద్ధలు కొట్టింది.టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారాపై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో గొప్ప ప్రదర్శన చేసిన పుజారా గురించి ఎంత చెప్పినా తక్కువే అని పేర్కొన్నారు. 140 కిలోమీటర్ల వేగంతో ఆసీస్ బౌలర్లు వేస్తున్న బంతుల్ని ఈ సిరీస్‌లో పుజారా ఎదుర్కొన్న తీరు అసాధారణమని, ఓ యోధుడి తరహాలో ప్రత్యర్థి బౌలర్లను అడ్డుకున్నాడన్నారు. మిగతా ఆటగాళ్లు అందరూ బాగా ఆడారన్నారు. టెస్టు సిరీస్ విజయం చరిత్రాత్మకమని, భారత క్రికెట్ చరిత్రలో ఈ విజయం మధుర ఘట్టమని సన్నీ అభిప్రాయపడ్డారు.