By : Oneindia Telugu Video Team
Published : November 04, 2019, 11:10
Duration : 02:16
02:16
ధోనీ,కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
భారత పర్యటనలో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (42 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. లక్ష చేధనలో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ముష్ఫికర్ రహీమ్ (43 బంతుల్లో 60 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్), సౌమ్య సర్కార్ (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు.