By : Oneindia Telugu Video Team
Published : November 04, 2019, 10:50
Duration : 02:37
02:37
టీమిండియాకు షాక్.. తొలి T20 లో బంగ్లా విజయం!!
సొంత గడ్డపై వరుస విజయాలతో దూసుకెళుతున్నటీమిండియాను బంగ్లాదేశ్ అడ్డుకుంది. ఇప్పటిదాకా ఆడిన ఎనిమిది టీ20ల్లో ఒక్క విజయం సాధించని బంగ్లా టైగర్స్ అద్భుతంగా పోరాడారు. తొలుత పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియాను మోస్తరు స్కోరుకే కట్టడి చేయగా.. ఆ తర్వాత సీనియర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ చివరివరకు క్రీజులో నిలబడి బంగ్లాకు చిరస్మరణీయ విజయం అందించాడు. తీవ్ర వాయు కాలుష్యం నడుమ మందకొడి పిచ్‌పై ఆదివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది.149 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా తొలి ఓవర్లోనే ఓపెనర్ లిటన్ దాస్ (7) వికెట్ కోల్పోయింది. కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న నయీమ్ (28 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్), సౌమ్య సర్కార్ (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్‌ప్లే ముగిసేసరికి బంగ్లా 45 పరుగులు చేసింది. అయితే స్పిన్నర్ చహల్ తన తొలి ఓవర్లోనే నయీమ్‌ను అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.