By : Oneindia Telugu Video Team
Published : March 01, 2021, 01:40
Duration : 01:55
01:55
మొతేరా పిచ్‌పై రోహిత్ ట్వీట్.. ట్రోల్ చేసిన రితిక!!
మొతేరా స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరగబోయే చివరిదైన నాలుగో టెస్టు గురువారం నుంచి ప్రారంభంకానుంది. నాలుగో టెస్టు కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఆదివారం భారత ఆటగాళ్లు నెట్ సెషన్లో సాధన చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ సాధన చేయగా.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఇక వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఫీల్డింగ్ డ్రిల్స్‌తో బిజీగా గడిపాడు. ఈ నేపథ్యంలో పిచ్ ఎలా ఉండనుందనే విషయంపై రోహిత్ శర్మ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.