By : Oneindia Telugu Video Team
Published : March 05, 2021, 05:00
Duration : 01:43
01:43
బుమ్రా (9) కంటే ఎక్కువసార్లు డకౌట్ అయిన కోహ్లీ (12)
నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు భోజన విరామ సమయానికి భారత్ 80/4తో నిలిచింది. అంతకుముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చి రాగానే డకౌట్ అయ్యాడు.బెన్ స్టోక్స్ వేసిన 26వ ఓవర్ నాలుగో బంతిని విరాట్ కోహ్లీ ఫ్లిక్ చేయగా.. బంతి బ్యాట్ ఎడ్జ్‌కి తాకి కీపర్ బెన్ ఫోక్స్ చేతిలో పడింది. అనూహ్యంగా దూసుకొచ్చిన షార్ట్‌పిచ్ బంతి ఆడలేక కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ డకౌట్‌తో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెత్త రికార్డును విరాట్ సమం చేయడం విశేషం. కోహ్లీకి కెప్టెన్‌గా టెస్టుల్లో ఇది 8వ డకౌట్. గతంలో ధోనీ కూడా కెప్టెన్‌గా 8సార్లు డకౌటయ్యాడు. ఇప్పుడు విరాట్ అతని రికార్డును సమం చేశాడు. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ డకౌట్ కావడం ఇది రెండోసారి.