By: Oneindia Telugu Video Team
Published : October 29, 2017, 04:32

రోహిత్ శర్మ 15th ODI సెంచరీ

Subscribe to Oneindia Telugu

కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నారు. రోహిత్ ఇప్పటికే సెంచరీ చేయగా, కోహ్లీ కూడా సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 196 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ చెలరేగుతున్నాడు. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీ నమోదు చేశాడు. 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్ శర్మ సెంచరీని నమోదు చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 15వ సెంచరీ కావడం విశేషం. మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ కూడా వన్డేల్లో 46వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ 100, కోహ్లీ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా