By : Oneindia Telugu Video Team
Published : February 24, 2018, 05:03

3వ టీ20: కోహ్లీ.. ధోనిలు.. రికార్డులు బద్దలు కొట్టేనా?


మూడు టీ20ల సిరిస్‌లో చివరిదైన మూడో టీ20 శనివారం రాత్రి 9.30 గంటలకు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనిలను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో 17 పరుగులు చేస్తే టీ20ల్లో 2000 పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిదే. టీ20ల్లో ఇప్పటి వరకు ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే రెండు వేల పరుగుల క్లబ్‌లో ఉన్నారు. ఆ ఇద్దరూ న్యూజిలాండ్‌కు చెందిన వారే కావడం గమనార్హం. మూడో టీ20లో కోహ్లీ మరో 17 పరుగులు చేస్తే రెండు వేల పరుగులు మైలురాయిని అందుకున్న మూడో క్రికెటర్ అవుతాడు.
మార్టిన్‌ గుప్టిల్‌ 75 మ్యాచ్‌ల్లో 2,271 పరుగులు సాధించగా, బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ 71 మ్యాచ్‌ల్లో 2,140 పరుగులతో ఈ ఘనత సాధించాడు. కివీస్ బ్యాట్స్‌మెన్లు ఇద్దరూ టీ20ల్లో రెండేసి సెంచరీలు చేశారు. అయితే టీ20ల్లో కోహ్లీకి సెంచరీ చేసే అవకాశం రాలేదు. టీ20ల్లో కోహ్లీ ఇప్పటి వరకు 18 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు.
ప్రస్తుతం కోహ్లీ 57 టీ20ల్లో 1,983 పరుగులు సాధించాడు. అంతేకాదు ఈ సిరిస్‌లో కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరనుంది. ఇంకా 129 పరుగులు సాధిస్తే ఒక పర్యటనలో వెయ్యి పరుగుల్ని సాధించిన రెండో క్రికెటర్‌గా కోహ్లీ నిలుస్తాడు. గతంలో విండిస్ దిగ్గజ క్రికెటర్‌ వివ్ రిచర్డ్స్‌ ఒక్కడే ఒక పర్యటనలో వెయ్యి పరుగుల్ని పూర్తి చేసిన క్రికెటర్‌గా ఉన్నాడు.
ఇక, వికెట్ కీపర్ ధోని విషయానికి వస్తే అంతర్జాతీయ టీ20ల్లో వికెట్‌ కీపర్‌గా 49 క్యాచ్‌లను అందుకున్నాడు. కేప్‌టౌన్‌ వేదికగా జరిగే టీ20లో మరో క్యాచ్‌ అందుకుంటే 50 క్యాచ్‌లు అందుకున్న తొలి వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టిస్తాడు. 32 క్యాచ్‌లు అందుకుని వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌ రామ్‌దిన్ ధోని తర్వాతి స్థానంలో ఉండగా, మూడో స్థానంలో 30 క్యాచ్‌లతో సఫారీ కీపర్‌ డికాక్‌ ఉన్నాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more