By : Oneindia Telugu Video Team
Published : January 21, 2021, 02:40
Duration : 02:43
02:43
ఆసీస్ తరహాలో ఇంగ్లండ్‌ను చిత్తు చేస్తే భారత్‌కు ఫైనల్ బెర్త్!
ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ తుది అంకానికి చేరుకుంది. మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ చాంపియన్ షిప్లో ఫైనల్‌కు చేరేందుకు టాప్ టీమ్స్ పోటీపడుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను 2-1తేడాతో నెగ్గిన టీమిండియా చాంపియన్‌షిప్ పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ నాలుగు జట్లకే టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరుకునే అవకాశాలు ఉండగా.. భారత్‌కు పరిస్థితులు మరీ అనుకూలంగా ఉన్నాయి.