By: Oneindia Telugu Video Team
Published : February 23, 2017, 02:30

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ....

Subscribe to Oneindia Telugu

నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పూణెలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బాగా డ్రైగా ఉందని, బౌన్స్‌కు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో బ్యాటింగ్ తీసుకున్నామని టాస్ గెలిచిన అనంతరం స్టీవ్ స్మిత్ తెలిపాడు.టీ20 మ్యాచ్‌లకు, టెస్టులకు చాలా తేడా ఉందని, ఈ టెస్టు సిరీస్‌కు బాగా ప్రాక్టీస్ చేశామని చెప్పాడు. ఆసీస్ తరుపున ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఆల్ రౌండర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఎటువంటి అంచనాలు లేకుండానే టాస్‌కు వచ్చానని అన్నాడు.
తుది జట్టులో భువనేశ్వర్ కుమార్ స్థానంలో జయంత్ యాదవ్‌ను తీసుకున్నట్టు కోహ్లీ వెల్లడించాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా