By : Oneindia Telugu Video Team
Published : January 15, 2021, 05:20
Duration : 01:58
01:58
60 ఏళ్ల తర్వాత 20 మంది ఆటగాళ్లతో టీమిండియా!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో టీమిండియాను గాయాల బెడద వేదిస్తోంది. అడిలైడ్‌లో తొలి టెస్టు ప్రారంభం కాకముందే ఇషాంత్ శర్మ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్.. ఇలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా గాయాలబారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే భారత్ ఈ సిరీస్‌లో ఎన్నడూ లేని విధంగా 20 మంది ఆటగాళ్లని ఆడించింది. ఇలా 1961-62 సీజన్ తర్వాత టీమిండియా ఇంతమందితో ఒక సిరీస్‌లో ఆడటం ఇదే తొలిసారి.