By : Oneindia Telugu Video Team
Published : November 04, 2019, 05:30
Duration : 01:27
01:27
ఫీల్డింగ్ తప్పిదాలే మా కొంపముంచాయి !!
తొలి టీ20 ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. ఫీల్డింగ్ తప్పిదాలే ఓటమికి ప్రధాన కారణం అని పేర్కొన్నాడు. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (42 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. చేధనలో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ముష్ఫికర్ రహీమ్ (43 బంతుల్లో 60 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్), సౌమ్య సర్కార్ (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు.