By : Oneindia Telugu Video Team
Published : November 05, 2019, 03:00
Duration : 01:38
01:38
వాయుకాలుష్యంతో వాంతి చేసుకున్న క్రికెటర్లు!!
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈ నెల 3న అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి తీవ్రంగా ఉండడంతో మ్యాచ్ జరిగిన ఆదివారం రోజున ఇద్దరు బంగ్లాదేశ్ క్రికెటర్లు వాంతులు చేసుకున్నారని సమాచారం తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరు స్టార్ ప్లేయర్ సౌమ్య సర్కార్ కాగా.. మరో ఆటగాడి పేరు తెలియరాలేదు.గత ఆదివారం రోజున ఢిల్లీ మొత్తం దుమ్మూ, ధూళీ, పొగ మంచుతో కప్పబడి ఉంది. దీంతో వాయు కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. ఆ రోజు ఉదయం 9 గంటలకు గాలి నాణ్యత (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 473గా ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. 400 దాటితే తీవ్రమైన వాయు కాలుష్యంగా పరిగణిస్తారు. కానీ. ఆ రోజు మాత్రం దాదాపు 500లకు దగ్గరా ఉంది.