By : Oneindia Telugu Video Team
Published : November 06, 2019, 12:00
Duration : 03:03
03:03
ఢిల్లీ ఓటమిని ఎప్పుడో మర్చిపోయాం.. ఖశ్చితంగా సిరీస్ గెలుస్తాం !
టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బంగ్లాదేశ్ టీ20 సిరీస్ కోసం చాలా మంది యువకులకు బీసీసీఐ జట్టులో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. గురువారం రాజ్‌కోట్ వేదికగా రెండో టీ20 జరగనుంది.మంగళవారం చహల్ మాట్లాడుతూ... 'ప్రస్తుతం ఆడుతున్న 11 మంది, జట్టులోని 15 మంది ఆటగాళ్లకు తమ పాత్రలు ఏంటో తెలుసు. ఒకటి రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత బయటకు వెళ్లిపోరు. రెండు మ్యాచ్‌లలో విఫలమయినంత మాత్రాన మేనేజ్మెంట్ నుండి ఎటువంటి ఒత్తిడి ఉండదు. అయితే ఒక మ్యాచ్‌లో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదు. మేము సానుకూలంగానే ఉన్నాం. గతంలో మొదటి మ్యాచ్‌లో ఓడిపోయి సిరీస్‌ను గెలిచిన సందర్భాలు ఉన్నాయి' అని అన్నాడు.