• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : November 06, 2019, 06:00
    Duration : 02:06

    రెండో టీ20 లో రెండు మార్పులతో టీమిండియా

    మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్‌ గురువారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది. భారత్‌పై బంగ్లా తొలి టీ20 విజయాన్ని అందుకుని సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రాజ్‌కోట్‌లో కూడా గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని బంగ్లా చూస్తుంటే.. విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భారత్ భావిస్తోంది.మ్యాచ్ ప్రారంభానికి ముందు ఫేవరెట్‌గా భావించిన టీమిండియా అంచనాలను అందుకోలేకపోయింది. ఫీల్డింగ్, బ్యాటింగ్‌, బౌలింగ్ అన్ని విభాగాల్లో పూర్తిగా నిరాశపరిచింది. అయితే రెండో టీ20లో గెలిస్తేనే భారత్ సిరీస్‌ రేసులో నిలుస్తుంది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టులో రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. తొలి టీ20 మ్యాచ్‌లో విఫలమయిన కేఎల్ రాహుల్ స్థానంలో యువ ఆటగాడు సంజు శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా